Politics20th Aug 05:09 PMSunil Byrisetty1 min read
వైసీపీ నేత సజ్జలపై కేసు!
వైసీపీ నేత రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు నమోదు చేసింది. పాల సేకరణ చేయకుండా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నారని సంగం డెయిరీపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు.
వైసీపీ నేత రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు నమోదు చేసింది.
పాల సేకరణ చేయకుండా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నారని సంగం డెయిరీపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు.
వాస్తవాలు కప్పిపుచ్చి, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ మేరకు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ సాక్షి టీవీ'తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పైనా కేసు దాఖలు చేశారు. పరువు నష్టం కింద రూ.10 కోట్లు చెల్లించాలని గుంటూరు కోర్టులో కేసు దాఖలైంది.