News29th May 09:30 AMSunil Byrisetty1 min read

బెజవాడలో బిస్కెట్ స్కామ్!

బెజవాడలో చీటీ పాటల తరహాలో పాడుకున్న వారికి బంగారం బిస్కెట్‌ ఇస్తానంటూ ఆశ చూపి నిలువునా మోసం చేశాడో వ్యాపారి. తాము మోసపోయామంటూ సుమారు 65 మంది పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ, అయోధ్యన

బెజవాడలో బిస్కెట్ స్కామ్!
బెజవాడలో చీటీ పాటల తరహాలో పాడుకున్న వారికి బంగారం బిస్కెట్‌ ఇస్తానంటూ ఆశ చూపి నిలువునా మోసం చేశాడో వ్యాపారి. తాము మోసపోయామంటూ సుమారు 65 మంది పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ, అయోధ్యనగర్‌కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్‌ స్థానికులతో పరిచయాలను ఉపయోగించుకుని చీటీలు వేసి అందరికీ సొమ్ము చెల్లించేవాడు. బంగారం బిస్కెట్‌ పేరుతో పలు రకాల పథకాలు పెట్టి అందరినీ ఆకర్షించాడు. బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుండడంతో తక్కువ ధరకు బంగారం ఇస్తానని ఆశ చూపాడు. ఒక్కొక్కరు ప్రతి నెలా 5 గ్రాముల బంగారం ధర ఎంత ఉంటే.. అంత సొమ్ము కట్టాలి. ఇలా 25 మంది సభ్యులు కడితే మొత్తం వచ్చిన 125 గ్రాములకు పాట పెడతారు. పాడుకున్న వారికి 125 గ్రాముల బంగారం బిస్కెట్‌ కొని ఇచ్చేస్తారు. పాడుకున్న వారు.. తర్వాతి నెల నుంచి 5 గ్రాములతో పాటు అదనంగా 3 గ్రాములు చెల్లించాలి. ఇలా తాము చీటీలు వేశామని, కానీ డబ్బులు ఇంకా ఇవ్వలేదని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మొత్తం 10 కోట్లకు పైగానే మోసం జరిగినట్లు అంచనా.
Andhra Pradesh News
Vijayawada
gold biscuit
10 crore gold fraud
muccharla srinivas
బంగారు బిస్కెట్ల స్కీం పేరుతో రూ.10 కోట్ల మోసం
బోర్డు తిప్పేసిన వ్యాపారి
65 మంది బాధితుల నుంచి కోట్లలో వసూలు
Scroll for the next article