News12th Nov 03:00 PMSunil Byrisetty1 min read
తాండవ రిజర్వాయర్‌లో 10 లక్షల చేప పిల్లల విడుదల
మత్స్యశాఖ ఆధ్వర్యంలో తాండవ రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం బుధవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన
మత్స్యశాఖ ఆధ్వర్యంలో తాండవ రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం బుధవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత గంగమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి, అనంతరం స్పీకర్ అయ్యన్న గారు, కలెక్టర్ విజయకృష్ణన్ గారు కలిసి తాండవ నీటిలో 10 లక్షల చేప పిల్లలను (వింగర్లింగ్స్) వదిలారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, తాండవ రిజర్వాయర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి, రైతులు, మత్స్యకారులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. నాతవరం నుండి తాండవ జంక్షన్ వరకు ఉన్న ఇరిగేషన్ రోడ్డును గతంలో పట్టించుకోలేదన్నారు. తాను ప్రత్యేక చొరవ తీసుకుని ఆ రోడ్డును ఆర్‌అండ్‌బీ శాఖకు బదిలీ చేయించానని, రూ. 6.36 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఒకటి రెండు నెలల్లో నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.