Education6th Nov 04:56 PMSunil Byrisetty1 min read
అంబేద్కర్ గురుకులాల్లో 10 నీట్, ఐఐటీ ఎక్సలెన్సీ సెంటర్లు
డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బా
డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి అన్నారు. గురువారం నాడు పల్నాడు జిల్లా అమరావతిలోని డా.బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి డీఎస్ బీవీ స్వామి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని వంట గది, మరుగుదొడ్లు, తరగతి గదులు మంత్రి పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల కోసం రూ 400 కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని గురుకులాల్లో నీట్, ఐఐటీ ఎక్సలెన్సీ సెంటర్లు 10 కి పెంచామన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉమ్మడి జిల్లాకొక ప్రత్యేక వైద్య అధికారిని నియమించామని తెలిపారు. విద్యార్థులు తన దృష్టికి తీసుకు వచ్చిన పాఠశాలలోని సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.