News29th Sep 05:56 PMSunil Byrisetty1 min read
వైసీపీ ఐదేళ్ల కంటే.. రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం
‘పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రహదారులు, తాగు నీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశు
‘పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రహదారులు, తాగు నీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతోపాటు పర్యాటక రంగానికీ ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం చుట్టామ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్లె బలపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందనే సంకల్పంతో ప్రతి పల్లెను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లెపండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,085 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 880 కి.మీ. సీసీ రోడ్లు నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం ద్వారా కేవలం రెండేళ్లలోనే దానికి 10 రెట్లు ఎక్కువగా, దాదాపు 9,000 కి.మీ. సీసీ రోడ్లను పూర్తి చేశామని చెప్పారు. గతంలో 304 మినీ గోకులాలు మాత్రమే నిర్మిస్తే, మనం దాదాపు 100 రెట్లు ఎక్కువగా, 30 వేలకు పైగా మినీ గోకులాలను నిర్మించామన్నారు. అలాగే, పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా 1 లక్ష 15 వేల పంట కుంటలను నిర్మించడంతోపాటు, 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేశామని వివరించారు.