News12th Oct 04:37 PMSunil Byrisetty1 min read
కాకినాడలో ఇన్‌కాయిస్ ప్రాంతీయ కేంద్రం
కాకినాడలో ఇన్‌కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించారు. ఎంపీ సతీశ్ బాబు, మంత్రులు భరత్, దుర్గేశ్ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇన్‌కాయిస్ ప్రాంతీయ కేంద్రం
కాకినాడలో ఇన్‌కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించారు. ఎంపీ సతీశ్ బాబు, మంత్రులు భరత్, దుర్గేశ్ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇన్‌కాయిస్ ప్రాంతీయ కేంద్రం కాకినాడకు వచ్చేలా సానా సతీశ్ బాబు చొరవ చూపించారు. జులై 21న కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ను కలిసిన ఎంపీ సానా సతీశ్ బాబు ఇన్‌కాయిస్ కేంద్రం ఏర్పాటుకు కాకినాడలో స్థలాన్ని గుర్తించారు. ఇన్‌కాయిస్ కేంద్రంతో మత్స్యకారులకు సముద్ర సమాచారం చేరువ కానుంది. చేపలవేటకు అనుకూలం, సముద్ర పరిస్థితులపై మత్స్యకారులకు సమాచారం అందుతుంది. కాకినాడ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు, ఆక్వా రంగానికి మరింత ఊతం రానుంది. పెట్టుబడులు, పరిశోధన, సాంకేతికత రంగాల్లో కాకినాడకు కొత్త అవకాశాలు అందనున్నాయి.