TTD21st Sep 11:21 AMSunil Byrisetty1 min read
గత ప్రభుత్వంలో పరకామణికే శఠగోపం!
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు తిరుమల ఏడుకొండల స్వామి ఆదాయాన్ని అడ్డగోలుగా దోచుకున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వంలో నాటి టీటీడీ పెద్దలు అందినకాడికి దోచుకున్నారు. ఏడుకొ
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు తిరుమల ఏడుకొండల స్వామి ఆదాయాన్ని అడ్డగోలుగా దోచుకున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వంలో నాటి టీటీడీ పెద్దలు అందినకాడికి దోచుకున్నారు. ఏడుకొండల వాడి సన్నిధిలో నాడు పరకామణిలో దొంగలు పడితే.. ఆ దొంగలనే వైసీపీ అనకొండలు దోచిన వాస్తవాలు బయటపడుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల్లో వైసీపీ హయాం నాటి టీటీడీ పెద్దల పాపాలు కనిపిస్తున్నాయి. 2019 నుంచి 2024వరకు తిరుమల శ్రీవారి సన్నిధిలో అనేక అపచారాలు, తప్పులు, పాపాలు చోటు చేసుకున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా నుంచి పరకామణి సొమ్ములు, హుండీలోని నిధులు.. ఇలా అదీ ఇదీ అని లేకుండా అన్నింటా చేతివాటం ప్రదర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో అనేక సంస్కరణలు, నిర్ణయాల ద్వారా తిరుమల ప్రతిష్టను పెంచేందుకు టీటీడీ పనిచేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత బయటపెట్టిన కల్తీ నెయ్యి వ్యవహారంతో దేశం నివ్వెరపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో మరో విస్తుపోయే వాస్తవం బయటకు వచ్చింది. గత ప్రభుత్వ పాపాల్లో దొంగలను మింగిన దొంగల వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. పరమ పవిత్ర క్షేత్రంలో స్వయంగా పరాకమణి సొమ్మును దోచేసిన, దాన్ని పంచుకున్న వైనం షాక్‌కు గురిచేస్తోంది. ధర్మారెడ్డి ఈవోగా, కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న సమయంలో పరకామణి సొమ్మునూ దోచేసిన వ్యవహారానికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది.