News1st Mar 07:04 PMSunil Byrisetty1 min read
తెలంగాణలో కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు హోంశాఖ కసరత్తు చేస్తున్నది. ప్రజలకు సత్వర సేవలు అందించ డంలో భాగంగా కార్యాచరణ చేపట్టింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు హోంశాఖ కసరత్తు చేస్తున్నది. ప్రజలకు సత్వర సేవలు అందించ డంలో భాగంగా కార్యాచరణ చేపట్టింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఇన్‌స్పెక్టర్లు ఉన్న పోలీస్ స్టేషన్లను సర్కిల్గా అప్గ్రేడ్ చేయడంతో పాటు కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిల్స్, ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా ప్రపోజల్స్ రెడీ చేసింది. ఈ మేరకు మల్టీజోన్ల వారీగా అవసరమైన పోలీస్ స్టేషన్ల వివ రాలకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాలను నియంత్రించేం దుకు అనువుగా కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తు న్నారు. దీంతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టారు.