Politics10th Mar 04:13 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ సేవల్లో 100 శాతం నాణ్యత, సంతృప్తి వ్యక్తం కావాలి
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో 100 శాతం నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం,
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో 100 శాతం నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలుచేయడంపై అన్ని స్థాయిల్లో దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.
ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష చేశారు. ప్రతివారం నాలుగు శాఖలపై సమీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబు...ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మునిసిపల్ శాఖలోని సేవల్లో వచ్చిన రిపోర్టులపై సమీక్ష చేశారు. పదేపదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని అదేశాలు ఇచ్చారు.
కరెప్షన్ అనేది ఒక జబ్బులాంటిదని, దీన్ని పూర్తిగా నివారించాల్సిందే అని సీఎం అన్నారు.