News13th Jan 12:41 PMSunil Byrisetty1 min read

తొలిరోజే 1000 ఎకరాల ల్యాండ్ పూలింగ్

అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్ కు ఇచ్చారని చెప్పారు. అంటే మూడు గ్రామాల

తొలిరోజే 1000 ఎకరాల ల్యాండ్ పూలింగ్
అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్ కు ఇచ్చారని చెప్పారు. అంటే మూడు గ్రామాల్లో 25 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తయిందన్నారు. భూములిచ్చిన రైతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దగ్గరుండి రైతులను ఒప్పిస్తున్నారన్నారు. అమరావతి అభివృద్ధి జరగాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు,ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అవసరమని తెలిపారు. నెలరోజుల్లోగా 80 శాతం భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటానని ఎమ్మెల్యే చెప్పారన్నారు. 80 శాతం పూలింగ్ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి టెండర్లు పిలుస్తామని మంత్రి తెలిపారు. రైతులకు ఇచ్చే ప్లాట్ లలో ముందుగా రెండు వరుసల రోడ్డు పూర్తి చేస్తామని నారాయణ వెల్లడించారు.
Andhra Pradesh capital
Amaravati development
land pooling
Minister Narayana
Amaravati mandal
farmers participation
Inner Ring Road
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ
మాస్టర్ ప్లాన్
మౌలిక వసతులు
Scroll for the next article