News31st Aug 05:03 PMSunil Byrisetty1 min read
పుష్కరాల కోసం రూ. వెయ్యి కోట్లు
గోదావరి నదీతీరం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర గోదావరి పుష్కరాల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహి
గోదావరి నదీతీరం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర గోదావరి పుష్కరాల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. పుష్కరాల దృష్ట్యా తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా ఉన్న గోదావరి నదీ తీరాలను, స్నాన ఘాట్లను సుందరీకరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.1,000 కోట్ల భారీ నిధులు కేటాయించింది. గోదావరి పుష్కరాల నిర్వహణలో నీటిపారుదల (ఇరిగేషన్), పంచాయతీరాజ్, రహదారులు-భవనాల (R&B) శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గోదావరి నదీ తీరం వెంబడి నూతన ఘాట్ల నిర్మాణం, పాత ఘాట్ల విస్తరణ, పటిష్ఠమైన రక్షణ గోడల నిర్మాణాల కోసం రూ.1,000 కోట్ల నిధుల వ్యయంతో ప్రణాళికలు రూపొందాయి. పుష్కరాలు ప్రారంభం కావడానికి కనీసం నెల రోజుల ముందే నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.