News1st Oct 04:38 PMSunil Byrisetty1 min read
జీఎస్టీ తగ్గింపుతో రూ.1,000 కోట్లు ఆదా!
జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుంది. ప్రాణధార మందులపై తగ్గించిన పన్నుతో ప్రజలు నేరుగా కొనుగోలుచేసే మందులు, సర్జికల్స్పై రూ.716 క
జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుంది. ప్రాణధార మందులపై తగ్గించిన పన్నుతో ప్రజలు నేరుగా కొనుగోలుచేసే మందులు, సర్జికల్స్పై రూ.716 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే కొనుగోళ్లలో రూ.250 కోట్లు వరకు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన కొనుగోళ్ల ఆధారంగా ఇకపై సుమారు రూ.1,000 కోట్లు వరకు ప్రజారోగ్యంపై భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. 'సెప్టెంబర్ 21వ తేదీ వరకు 12%, 5% చొప్పున మందులపై జీఎస్టీ ఉండేది 12% కేటగిరిలోనే 99% మందులు ఉన్నాయి. 12% పన్నును 5%కు కేంద్రం తగ్గించింది. దీనివల్ల ప్రస్తుత మందులపై 7% వరకు పన్ను తగ్గింది. క్యాన్సర్, ఇతర అరుదైన కేటగిరిలో ఉన్న 33 రకాల మందులపై 12% వరకు ఉన్న పన్నును కేంద్రం పూర్తిగా తొలగించింది. దీనివల్ల ప్రజారోగ్యానికి భారీ ఊరట లభించింది' అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో సుమారు 35 వేల వరకు మందుల దుకాణాలు, 5 వేల వరకు టోకు వర్తక సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 11,250 కోట్ల విలువైన మందులు, సర్టికల్స్ విక్రయాలు జరిగాయి. దీని ప్రకారం రూ.1,350 కోట్లు వరకు పన్నుల భారం ప్రజలపై పడినట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలనా విభాగం తెలిపింది.