Telangana1st Sep 05:31 PMSunil Byrisetty1 min read
పాలనకు 1000 రోజులు.. పండుగా? దండగా?
తెలంగాణలో చిన్న విషయం కూడా హైలైట్ అయిపోతుంది. ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకోవడాన్ని ఆయా పార్టీలు తమకు అనుకూలమైన ప్రచారానికి వాడుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రజాపాలనగా
తెలంగాణలో చిన్న విషయం కూడా హైలైట్ అయిపోతుంది. ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకోవడాన్ని ఆయా పార్టీలు తమకు అనుకూలమైన ప్రచారానికి వాడుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రజాపాలనగా అభివర్ణిస్తూ సంబరాలు చేసుకుంటోంది. అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పాలన విధ్వంసకరంగా ఉందంటూ పోరాటాలకు దిగుతోంది. 1000 రోజుల పాలనలో రేవంత్ సర్కార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తోందంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ, యువతకు ఉపాధి కల్పిస్తూ, రైతులకు, మహిళలకు భరోసా అందిస్తూ ముందుకు సాగుతోందంటూ పాలనకు 100 మార్కులు వేసుకుంది. బీఆర్ఎస్ మాత్రం గెలిచి 1000 రోజులు పూర్తైనా ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదంటూ దుమ్మెత్తి పోస్తోంది. విధ్వంస పాలనపై పోరుబాట అంటూ సెప్టెంబర్ 2 – 8 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.