News20th Mar 09:59 AMSunil Byrisetty1 min read

వెయ్యి వసూలు చేయాలని మాకూ లేదు

ఏపీలో హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే ద్విచక్రవాహనదారులకు పోలీసులు షాకిస్తున్న విషయం తెలిసిందే. హెల్మెట్ లేకుంటే ఫొటో తీసి, రూ. వెయ్యి ఫైన్ బాదేస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా

వెయ్యి వసూలు చేయాలని మాకూ లేదు
ఏపీలో హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే ద్విచక్రవాహనదారులకు పోలీసులు షాకిస్తున్న విషయం తెలిసిందే. హెల్మెట్ లేకుంటే ఫొటో తీసి, రూ. వెయ్యి ఫైన్ బాదేస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారు జనం. దీంతో ఈ అంశంపై హోంమంత్రి అనిత స్పందించారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ హెల్మెట్‌కి రూ.1000 ఫైన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అని చెప్పారు. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇది కూడా రాష్ట్రమంతా ఇంకా అమలు చేయటం లేదని చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్‌గా కొన్ని చోట్ల మాత్రమే అమలు చేస్తూ, అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. బ్లాక్స్ స్పాట్స్‌ని ఐడెంటిఫై చేసి, సెక్యూరిటీ పెంచామని చెప్పారు. రూ.1000 భారం ప్రజలపై వేయాలని ప్రభుత్వానికి కూడా లేదని స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించటంపై మరిన్ని అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నామని మంత్రి అనిత చెప్పారు
Not Wearing Helmet
Home Minister Anitha
Supreme Court
మంత్రి అనిత
Scroll for the next article