News31st Jan 04:11 PMSunil Byrisetty1 min read
10 వేల SIPతో రూ. 34 లక్షల సంపద!
ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ అందిస్తున్న ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ గత పదేళ్లలో కళ్లు చెదిరే రాబడులను అందించింది. ఒకవేళ మీరు పదేళ్ల క్రితం ఈ పథకంలో నెలకు రూ. 10,000 చొప్పున పెట్టుబడి (SIP)
ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ అందిస్తున్న ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ గత పదేళ్లలో కళ్లు చెదిరే రాబడులను అందించింది. ఒకవేళ మీరు పదేళ్ల క్రితం ఈ పథకంలో నెలకు రూ. 10,000 చొప్పున పెట్టుబడి (SIP) పెట్టి ఉంటే, ఈరోజు మీ పెట్టుబడి విలువ ఏకంగా రూ. 34 లక్షలకు పైగా ఉండేది. ఈ ఫండ్ పదేళ్లలో ఏడాదికి సగటున 19.86 శాతం వార్షిక రాబడిని అందించడమే ఇందుకు కారణం. కేవలం నెలవారీ పొదుపు చేసేవారికే కాదు, ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి కూడా ఈ ఫండ్ కాసుల వర్షం కురిపించింది. మీరు మూడేళ్ల క్రితం పెట్టిన రూ. 1 లక్ష ఇప్పుడు రూ. 2.10 లక్షలు అయింది. ఐదేళ్ల క్రితం పెట్టిన లక్ష రూపాయలు రూ. 3.31 లక్షలుగా పెరిగింది. పదేళ్ల క్రితం ఒకేసారి పెట్టిన లక్ష రూపాయలు ఇప్పుడు రూ. 5.17 లక్షలు అయింది.