News5th Aug 10:20 AMSunil Byrisetty1 min read

గుంటూరుకు గుడ్ న్యూస్.. రూ.100 కోట్లతో యోగా సంస్థ

గుంటూరు జిల్లాలో కేంద్ర యోగా పరిశోధన సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (CRIYN

గుంటూరుకు గుడ్ న్యూస్.. రూ.100 కోట్లతో యోగా సంస్థ
గుంటూరు జిల్లాలో కేంద్ర యోగా పరిశోధన సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (CRIYN) ఏర్పాటు కానుంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ బృందం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 15.03 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను నిర్మించనున్నారు. ఈ సంస్థలో 100 పడకల ఆధునిక ఆసుపత్రితో పాటు యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించిన పరిశోధన, శిక్షణ, వైద్య సేవలు లభిస్తాయి. ఎన్డీయే ప్రభుత్వం సంప్రదాయ యోగా, ప్రకృతి వైద్యానికి ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఏపీలో ఈ సంస్థ ఏర్పాటు కానుంది.
Andhra Pradesh
Guntur
CRIYN
Yoga Research Institute
AYUSH Ministry
Naturopathy
ఆంధ్రప్రదేశ్
సత్యకుమార్ యాదవ్
ప్రత్తిపాడు
కేంద్ర ప్రభుత్వం
ఆరోగ్యం
Scroll for the next article