Spiritual9th Nov 02:18 PMSunil Byrisetty1 min read

దుర్గమ్మ అన్నదాన పథకానికి విరాళం

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నిరంతరం కొనసాగే అన్నప్రసాద వితరణ పథకానికి (అన్నదానం ట్రస్ట్) భక్తులు విరాళాన్ని అందజేశారు. విజయవాడ పట

దుర్గమ్మ అన్నదాన పథకానికి విరాళం
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నిరంతరం కొనసాగే అన్నప్రసాద వితరణ పథకానికి (అన్నదానం ట్రస్ట్) భక్తులు విరాళాన్ని అందజేశారు. విజయవాడ పటమటకు చెందిన పులగం లీల రాజీవ్ శ్రీ అమ్మవారి నిత్య అన్నదాన ట్రస్ట్‌ కొరకు రూ. 1,01,116/- (అక్షరాలా ఒక లక్షా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు) మొత్తాన్ని విరాళం అందించారు. దాత కుటుంబ సభ్యులకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గాంధీ మర్యాదలతో శ్రీ అమ్మవారి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేసి చిత్రపటం అందజేశారు.
Scroll for the next article