News4th Jan 01:49 PMSunil Byrisetty1 min read
మన్యంలో గిరిజన గ్రామాలకు ₹105 కోట్లతో రోడ్లు
గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల లేమి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, పార్వతీపురం జిల్లాకు 105 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల లేమి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, పార్వతీపురం జిల్లాకు 105 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ రహదారులు పూర్తికావడం ద్వారా గ్రామాల మధ్య రాకపోకలు సులువవుతుందని పేర్కొన్నారు.
గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలకు 1300 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టామని గుర్తు చేశారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి కోసం జిల్లా వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల్లో
టాయిలెట్స్, బాత్రూంలు, ఆర్వో ప్లాంట్లు, మెస్సుల అభివృద్ధి కోసంపార్వతీపురం జిల్లా మొత్తం: ₹4.35 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా: ₹37.51 కోట్లు
సాలూరు నియోజకవర్గానికి మాత్రమే:
• 75 బాత్రూంలు – ₹75 లక్షలు
• 3 ఆర్వో ప్లాంట్లు – ₹11.50 లక్షలు
• 3 మెస్సులు – ₹6.60 లక్షలు
మొత్తం: ₹93 లక్షలు
కురుపాం నియోజకవర్గానికి అధికంగా
• 236 బాత్రూంలు, 4 ఆర్వో ప్లాంట్లు, 6 మెస్సులు
మొత్తం: ₹2.69 కోట్లు
పార్వతీపురం నియోజకవర్గానికి ₹35 లక్షలు,
పాలకొండ నియోజకవర్గానికి ₹39 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు.