Spiritual7th Oct 01:01 PMSunil Byrisetty1 min read
108 చీరల అలంకరణలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ దర్శనం
ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో ప్రతీ పౌర్ణమికి చండీహోమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నం పరబ్రహ్మ స్వరూపంగా వందల
ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న
శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో ప్రతీ పౌర్ణమికి చండీహోమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నం పరబ్రహ్మ స్వరూపంగా వందలాది మంది భక్తులకు అన్నసమారాధన జరిగింది.ఆలయంలో సెప్టెంబర్ 22న దసరా శరన్నవరాత్రులు ప్రారంభమై ఈరోజు 80వ చండీహోమం, మహాపూర్ణాహుతితో సంపూర్ణమయ్యాయి. 15 రోజులుగా జరిగిన దసరా వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని నవరాత్రులలో వివిధ అవతారాలలో దర్శించారు. మహిళలు కుంకుమార్చన, విశేషపూజ,హారతులు,సామూహిక పూజా కార్యక్రమాలు, అభిషేకాలలో పాల్గొని తరించారు. అమ్మ వారికి అష్టోత్తర శత నామార్చనతో నామానికి ఒక చీర చొప్పున 108 చీరలతో చేసిన విశేష అలంకరణ భక్తుల దర్శనార్థం ఈ నెల 10వ తేదీ వరకు భక్తుల కోరిక మేరకు ఉంటుందని ఆలయ పెద్దలు తెలియజేశారు.