Education19th Mar 11:20 AMSunil Byrisetty1 min read
టెలిగ్రాంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు?
టెక్నాలజీ సక్రమంగా ఉపయోగిస్తే ఎంత ఉపయోగమో, తప్పుదారిలో ఉపయోగిస్తే అంత అనర్థం కూడా. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్‌ను అడ్డదారిలో వాడేస్తున్న యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఏపీ
టెక్నాలజీ సక్రమంగా ఉపయోగిస్తే ఎంత ఉపయోగమో, తప్పుదారిలో ఉపయోగిస్తే అంత అనర్థం కూడా.
స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్‌ను అడ్డదారిలో వాడేస్తున్న యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది.
ఏపీలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నాపత్రాలు టెలిగ్రాంలో లీకయ్యాయన్న ప్రచారం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
నిజంగా ప్రశ్నాపత్రాలే పంపుతారా అంటే ముందైతే డబ్బు దోచేస్తున్నారు.
దీనిపై విద్యా శాఖలో అలసత్వం కనిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
విద్యార్థులకు స్కానర్ పంపిస్తూ స్కామర్స్ ఎర వేస్తున్నారు.
ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లు పంపుతామని కొందరు టెలిగ్రామ్ యాప్‌లో విద్యార్థుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు.
ఇలాంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలని,వారి దగ్గర నిజంగా పేపర్లు ఉన్నాయా? అనేది కూడా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
టెలిగ్రాం ఛానల్ లింక్ సమాచారం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.