News29th Jan 11:58 AMSunil Byrisetty1 min read

ఎన్.ఐ.ఆర్.డి లో ఎస్.హెచ్.జి మహిళలకు 10వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ

ఎంపీ కేశినేని శివనాథ్ సారధ్యంలో కేశినేని ఫౌండేషన్, ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్, గిఫ్ట్ ఆర్టిక‌ల్స్, హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ విధానంపై ఐదు రోజుల

ఎన్.ఐ.ఆర్.డి లో ఎస్.హెచ్.జి మహిళలకు 10వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ
ఎంపీ కేశినేని శివనాథ్ సారధ్యంలో కేశినేని ఫౌండేషన్, ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్, గిఫ్ట్ ఆర్టిక‌ల్స్, హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ విధానంపై ఐదు రోజుల పాటు శిక్ష‌ణ పొందేందుకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి వెళ్లిన 50 మంది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలకు శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. 10వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కు వెళ్లిన వీరికి జ‌న‌వ‌రి 28 నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్ త‌యారీ విధానంపై శిక్షణ వుంటుంది. ఈమేరకు ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఐదు రోజుల నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ప్రారంభ స‌మావేశం ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో బుధ‌వారం అసోసియేట్ ఫ్రోపెసర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె -హెడ్) డా. సి.కత్తిరేషన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ స‌మావేశంలో అసోసియేషన్ ప్రోఫెసర్ డాక్టర్ ఎస్.రమేష్ శక్తివేల్, శిక్ష‌ణ తీసుకునే 50 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు ముందుగా జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్ , గిఫ్ట్ ఆర్టిక‌ల్స్ అందజేశారు.
Andhra Pradesh
NIRD
SHG Women
Skill Development Training
Women Empowerment
Kesineni Foundation
MP Kesineni Sivanath
Jute Bags
కాటన్ బ్యాగ్స్
గిఫ్ట్ ఆర్టికల్స్
హెర్బల్ ఉత్పత్తులు
ఎన్టీఆర్ జిల్లా
Scroll for the next article