Spiritual30th Aug 04:33 PMSunil Byrisetty1 min read

కనకదుర్గమ్మకు రూ. 11 లక్షల విలువైన బంగారు జడ

విజయవాడ ఇంద్రకీలాద్రపై కొలువై ఉన్న దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అమ్మవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా ఒక బంగారు జడను తయారు చేయించారు. రూ. 11 లక్షల వ్యయంతో రూపొం

కనకదుర్గమ్మకు రూ. 11 లక్షల విలువైన బంగారు జడ
విజయవాడ ఇంద్రకీలాద్రపై కొలువై ఉన్న దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అమ్మవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా ఒక బంగారు జడను తయారు చేయించారు. రూ. 11 లక్షల వ్యయంతో రూపొందించిన ఈ సుందరమైన బంగారు జడను ఆదివారం ఉదయం ఆలయ ఆలయ ఈవో వి కే శీనా నాయక్, అర్చకులకు అందజేశారు. అమ్మవారి అలంకరణ కొరకు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుటుంబం తరపున చేయించారు. మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి ఈ స్వర్ణ ఆభరణాన్ని అర్చకులకు అందజేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆ ఆభరణం మొత్తం విలువ రూ. 11 లక్షలు ఆభరణం సుమారు 130 గ్రాముల నుండి 160 గ్రాముల (సుమారు 13 నుండి 16 తులాలు) మధ్య నికర బంగారు బరువు ఆభరణం/డిజైన్ సాంప్రదాయ పద్ధతిలో, ఎంతో నైపుణ్యంతో రూపుదిద్దుకున్న లక్ష్మీదేవి ఇతర దైవిక రూపాలు కలిగిన బంగారు జడ. దీనికి కింద ఆకుపచ్చ రంగు విలువైన రాళ్లు, ముత్యాలు పొదిగి ఉన్నాయి.
Ap news
Kanaka Durga Amma
Durga Temple
Vijayawada
Indrakeeladri
Kanaka Durga Temple
Gold Ornament
Gold Jada
Temple Jewellery
Borra Radhakrishna
వీకే శీనా నాయక్
భక్తి వార్తలు
ఆంధ్రప్రదేశ్ ఆలయాలు
విజయవాడ వార్తలు
ఆలయ వార్తలు
Scroll for the next article