News13th Apr 11:12 AMSunil Byrisetty1 min read
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేసు.. పోలీస్ అధికారులపై వేటు
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచే సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై ఉన్నతాధికారులు చర్యలు
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.
వైసీపీ ఎంపీని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచే సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
గోరంట్ల మాధవ్‌ను కోర్టులో హాజరుపరిచే సమయంలో జరిగిన లోపాలపై ప్రభుత్వం సీరియస్ అయింది.
కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విచారణ జరిపారు.
గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు తీసుకువెళ్లిన సమయంలో మాధవ్ ఫోన్‌లో మాట్లాడినా సిబ్బంది అభ్యంతరం చెప్పలేదు.
మీడియా ముందు ప్రవేశపెట్టే ముందు తనకే ముసుగు వేస్తారా అంటూ పోలీసులపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులపై దురుసుగా ప్రవర్తించినా నిలువరించలేకపోయారు. ఇవన్నీ పోలీసుల వైఫల్యమేనని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు.
మాధవ్‌కు ఎస్కార్ట్‌గా ఉన్న 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు.