News24th Jul 02:39 PMSunil Byrisetty1 min read
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడులకు 1.10 లక్షల మంది
వచ్చే ఏడాది లోగా గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం, పాడైన బిల్డింగులను బాగు చేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సుమారు 1.10లక్షల
వచ్చే ఏడాది లోగా గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం, పాడైన బిల్డింగులను బాగు చేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సుమారు 1.10లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరారని తెలిపారు.. దీనికి కారణం ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులే. పిల్లల మంచిమార్కులే మనకు పబ్లిసిటీ అని చెప్పారు. ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల బ్రాండ్ అంబాసిడర్లుగా మారారన్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం డిమాండ్ పెరిగిందని, ఉపాధ్యాయుల కఠోరశ్రమతో ప్రభుత్వ స్కూళ్లకు పూర్వవైభవం వస్తోందని లోకేష్ అన్నారు.