News4th Nov 03:55 PMSunil Byrisetty1 min read
గిరిజన వసతి గృహాల్లో సదుపాయాలకు రూ.113 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది ఐ.టి.డి.ఏ.లోనున్న 757 గిరిజ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.113 కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మహిళా అభివృద్ది & శిశు సంక్షేమ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది ఐ.టి.డి.ఏ.లోనున్న 757 గిరిజ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.113 కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మహిళా అభివృద్ది & శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఇందులో రూ.83 కోట్లను గిరిజన ఆశ్రమ పాఠశాలకు, రూ.30 కోట్లను గురుకుల పాఠశాలలకు ఇవ్వడం జరిగిందన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకై గత ఏడాది రూ.155 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా మరిన్ని మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో రూ.113 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 757 గిరిజ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 199 గురుకులాలు, 558 ఆశ్రమ పాఠశాలలు ఉన్నట్లు ఆమె తెలిపారు. వీటన్నింటిలో ఆర్.ఓ. ప్లాంట్లు, వాష్ రూములు, ఇతర సదుపాయాలను కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. వీటన్నింటినీ టాయిలెట్లు నిర్మాణానికి ఇప్పటికే 2,012 టాయిలెట్లను స్వచ్ఛాంధ్రా కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయడం జరిగిందని, వీటి నిర్మాణ పనులు ప్రగతిలో నున్నట్లు ఆమె తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడుకునే వీలుగా అన్ని వసతి గృహాల్లో ప్రిపెయిడ్ పోన్లు, కాయిన్ ఫోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.