News23rd Jan 03:41 PMSunil Byrisetty1 min read

రాజధాని రైతులకు ఇ-లాట‌రీ ద్వారా ప్లాట్ల కేటాయింపు

రాజధాని రైతులకు ఇ-లాట‌రీ ద్వారా 115 ప్లాట్ల కేటాయింపు జరిగింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం పూర్తి పార‌ద‌ర్శ‌కంగా అధికారులు ప్లాట్ల‌ను కేటాయించారు. రోడ్డు శూల లేని,ల్యాండ్ అక్విజిష‌న్ స్థ‌ల

రాజధాని రైతులకు ఇ-లాట‌రీ ద్వారా ప్లాట్ల కేటాయింపు
రాజధాని రైతులకు ఇ-లాట‌రీ ద్వారా 115 ప్లాట్ల కేటాయింపు జరిగింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం పూర్తి పార‌ద‌ర్శ‌కంగా అధికారులు ప్లాట్ల‌ను కేటాయించారు. రోడ్డు శూల లేని,ల్యాండ్ అక్విజిష‌న్ స్థ‌లంలో లేని ప్లాట్లు మాత్ర‌మే కేటాయిస్తున్నామని ఏపీ సీఆర్డీఏ ప్రకటించింది. ప‌ల్ల‌పు ప్రాంతాలు,స‌మాధుల స‌మీపంలో ప్లాట్లు కేటాయిస్తున్నార‌నేది కొంత‌మంది అపోహ‌ మాత్ర‌మేనని తేల్చి చెప్పింది. ద‌క్షిణ ముఖంగా వ‌చ్చిన ప్లాట్లను మొద‌టి నుంచీ రోడ్డు శూల ప్లాటుగా ప‌రిగ‌ణించ‌లేదని పేర్కొంది. రిట‌ర్న‌బుల్ ప్లాట్ లేఅవుట్ రూల్స్ ప్ర‌కార‌మే మొత్తం ప్ర‌క్రియ జ‌రిగిందని తెలిపింది.
Andhra Pradesh
Capital Farmers
E-Lottery
Plot Allotment
AP CRDA
Amaravati
Transparent Process
రిటర్నబుల్ ప్లాట్లు
పారదర్శక విధానం
భూకేటాయింపు
Scroll for the next article