News22nd Apr 12:50 PMSunil Byrisetty1 min read
మండుతున్న ఎండల్లో.. మూగజీవాలకు ఊరట
మండుతున్న ఎండల్లో.. మూగజీవాలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో కొత్తగా నిర్మిస్తున్న నీటి తొట్టెలు మూగ జీవాల దాహార్తి తీర్చుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి
మండుతున్న ఎండల్లో.. మూగజీవాలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గ్రామాల్లో కొత్తగా నిర్మిస్తున్న నీటి తొట్టెలు మూగ జీవాల దాహార్తి తీర్చుతున్నాయి.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో గత 20 రోజుల వ్యవధిలో 12 వేల తొట్టెల నిర్మాణం పూర్తి చేశారు.
ఈ నెలాఖరులోగా మరో 3 వేల తొట్టెలు నిర్మించనున్నారు.
వేసవి నేపథ్యంలో పశువులు, మేకలు, గొర్రెల తాగునీటికి ఇబ్బంది లేకుండా పశుసంవర్ధక శాఖ గుర్తించిన గ్రామాల్లో 15 వేల నీటి తొట్టెల నిర్మాణానికి ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.
అందులో ఇప్పటి వరకు దాదాపు 80% నిర్మాణాలు పూర్తయ్యాయి.
వీటిని రోజూ నీటితో నింపే ఏర్పాట్లు చేశారు.
ఒక్కో నీటి తొట్టె నిర్మాణానికి రూ.45 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు.
ఒక్కో దాంట్లో 3 వేల లీటర్ల నీరు నిల్వ చేసేలా డిజైన్ చేశారు.
వీటి ద్వారా 15 లక్షల మూగ జీవాలకు రోజూ తాగునీటి వసతి అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ సంచాలకులు కృష్ణతేజ తెలిపారు.