News25th Nov 03:34 PMSunil Byrisetty1 min read

నాలుగేళ్లలో 12.59 లక్షల గృహాల పూర్తి

రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి

నాలుగేళ్లలో 12.59 లక్షల గృహాల పూర్తి
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఐదేళ్లలో 15.59 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని అన్నారు. ఇందులో ఇప్పటికే 3.00 లక్షల గృహాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 12.59 లక్షల గృహాలను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయడం జరుగుతుంది మంత్రి తెలిపారు. ఇప్పటికే పూర్తి చేసిన 3 లక్షల గృహాలతో పాటు వచ్చే ఉగాదికి 5 లక్షల గృహాలను, జూన్ కల్లా మరో 87 వేల గృహాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పిఎంఏవై-1.00 పథకం అమలు గడువును కేంద్రం మరో ఏడాది పాటు పొడిగించిన నేపథ్యంలో ఈ పథకం క్రింద ఇప్పటి వరకూ ప్రారంభం కాని 3.03 లక్షల గృహాలను కూడా ఈ ఏడాది డిసెంబరు కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు.
Andhra Pradesh
Housing Scheme
PMAY
Andhra Pradesh Government
Kollu Parthasaradhi
Chandrababu Naidu
Housing Construction
Poor Housing Beneficiaries
Ugadi Targets
గ్రామీణ గృహ నిర్మాణం
నగర అభివృద్ధి
ప్రభుత్వం పథకాలు
గృహ ప్రవేశం
Scroll for the next article