News7th Jan 03:26 PMSunil Byrisetty1 min read

ప్రమాణ స్వీకారం చేసిన 13 మంది MSME డైరెక్టర్లు

మంగళగిరి గోపు కన్వెన్షన్ సెంటర్ లో 13 మంది MSME డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ తో కలిసి కార్యక్రమానికి హాజరై, ప్రమాణ స్వీకారం చేసిన డై

ప్రమాణ స్వీకారం చేసిన 13 మంది MSME డైరెక్టర్లు
మంగళగిరి గోపు కన్వెన్షన్ సెంటర్ లో 13 మంది MSME డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ తో కలిసి కార్యక్రమానికి హాజరై, ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లు అందరికీ అభినందనలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడిన వారికి డైరెక్టర్ పదవులు రావడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో అందరం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కష్టపడుతున్నామని వివరించారు. 'ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త' విధానం ద్వారా అందరికీ పారిశ్రామిక రంగంలో అవకాశాలు కల్పించాలని చంద్రబాబు కష్టపడుతున్నారని తెలిపారు. ఈ లక్ష్యం కోసం మన వంతు కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
Andhra Pradesh
MSME Directors
Oath Taking Ceremony
Mangalagiri
Gopu Convention Centre
Kondapalli Srinivas
Thammireddy Siva Shankar
Chandrababu Naidu
పారిశ్రామిక అభివృద్ధి
ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త
Scroll for the next article