News24th Jan 05:20 PMSunil Byrisetty1 min read

కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు

గ్రామీణ కిడ్నీ రోగులకు కష్టాలు తొలగించేలా రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ (రక్త శుద్ధి) కేంద్రాలను సెకండరీ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలను వేగవంతం చేసినట్లు మంత్రి సత్యకుమార్

కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు
గ్రామీణ కిడ్నీ రోగులకు కష్టాలు తొలగించేలా రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ (రక్త శుద్ధి) కేంద్రాలను సెకండరీ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలను వేగవంతం చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇంతకుముందు ప్రకటించిన వాటితోపాటు కొత్తగా మంజూరైన 5 తో కలిపి మొత్తం 13 డయాలసిస్ సెంటర్లు సెకండరీ ఆస్పత్రుల్లో రాబోతున్నా యని తెలిపారు. ఇందులో 2 కేంద్రాలు గిరిజన ప్రాంత ఆసుపత్రుల్లో ఉన్నాయని, వీటిల్లో అతి త్వరలో సేవలు ప్రారoభం అవుతాయని, మిగిలిన కేంద్రాలు ఏప్రిల్ నాటికి సిద్ధం అవుతాయని వెల్లడించారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తిరుపతి జిల్లా రైల్వేకోడూరు, ప్రకాశం జిల్లా కొండేపి, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, కడప జిల్లా మైదుకూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున డయాలసిస్ కేంద్రాన్ని 'ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం' (పీఎంఎన్డీపీ) కింద మంజూరైనట్లు మంత్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, చిత్తూరు జిల్లా పీలేరు ఏరియా ఆసుపత్రుల్లో, ఎస్పీఎస్ఆర్ జిల్లా వెంకటగిరి, ప్రకాశం జిల్లా అద్దంకి, నంద్యాల జిల్లా సున్నిపెంట సీహెచ్ సి, కడప జిల్లా జమ్మలమడుగు ఆసుపత్రిలో ఒక్కొక్క డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు.
Andhra Pradesh
Dialysis
Kidney Patients
Secondary Hospitals
Satyakumar Yadav
Government Health
PM National Dialysis Program
Tirupati
Prakasam
చిత్తూరు
నంద్యాల
వెంకటగిరి
అద్దంకి
జమ్మలమడుగు
Scroll for the next article