Spiritual29th Dec 01:31 PMSunil Byrisetty1 min read
6 నుంచి ఉరుసు ఉత్సవాలు
హిందూ, ముస్లింలు ఐక్యంగా ఆరాధించే హజరత్ కాలే మస్తాన్ షా అవులియా బాబా 134వ ఉరుసు ఉత్సవాలు జనవరి 6 నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. గుంటూరులో జనవరి 6వ తేదీ మంగళవారం నుంచి 10వ తేదీ శన
హిందూ, ముస్లింలు ఐక్యంగా ఆరాధించే హజరత్ కాలే మస్తాన్ షా అవులియా బాబా 134వ ఉరుసు ఉత్సవాలు జనవరి 6 నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. గుంటూరులో జనవరి 6వ తేదీ మంగళవారం నుంచి 10వ తేదీ శనివారం వరకు అత్యంత వైభవంగా జరిగే ఉరుసు ఉత్సవాలకు భక్తులందరూ తరలి రావాలని జగద్గురువులు హజరత్ కాలే మస్తాన్ షావలి దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కోరారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ హిందూ, ముస్లింలు ఐక్యంగా ఆరాధించే దైవం మస్తాన్ బాబా అని చెప్పారు. 134వ ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చాందిని అలంకరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అదే రోజు అన్నదానం, రాత్రి 11 గంటలకు సందల్ (గంధం) ఊరేగింపు వేలాది మంది భక్తులతో కొనసాగుతుందని వివరించారు. 7న గంధం పంపిణీ, దీపారాధన, అనంతరం అన్నదానం జరుగుతాయని చెప్పారు. 8న ఆదివారం గ్యార్మి షరీఫ్(ఖురాన్ పఠనం) ఉంటుందన్నారు. తెల్లవారుజామున ప్రసాదం పంపిణీ, అన్నదానం చేయడం ఉంటాయని తెలిపారు. 9న సోమవారం భక్తులు ఏడాది పొడుగునా బాబావారికి భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్న చద్దర్లు (శేష వస్త్రాలు) ఫకీర్లకు పంచుతామని వివరించారు. ఉత్సవాల్లో చివరి రోజైన 10న బాబావారు ఆశీనులైన కుర్చీని యథాస్థానంలో ఉంచడంతో ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయని తెలిపారు.