News22nd Oct 02:02 PMSunil Byrisetty1 min read

కరకట్టకు మరమ్మతులు

విజయవాడను దివిసీమతో అనుసంధానించే కృష్ణా కరకట్ట బలోపేతం నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. 58.5 కిలోమీటర్ల కరకట్ట అభివృద్ధికి రూ.136.25 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థికశా

కరకట్టకు మరమ్మతులు
విజయవాడను దివిసీమతో అనుసంధానించే కృష్ణా కరకట్ట బలోపేతం నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. 58.5 కిలోమీటర్ల కరకట్ట అభివృద్ధికి రూ.136.25 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. పులిగడ్డ నుంచి విజయవాడ వరకు ఉన్న కృష్ణానది కరకట్ట ప్రధాన రహదారి పునర్నిర్మాణ ఆవశ్యకతను కొద్ది నెలల క్రితం జరిగిన కృష్ణాజిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన సీఎం చంద్రబాబు, వెంటనే కరకట్ట రోడ్డు పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఉన్నత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు విజయవాడ వెళ్లేందుకు కీలకమైన రవాణా మార్గంగాను, కృష్ణానది పరివాహక గ్రామాలకు రక్షణ కవచంగాను నిలిచే 58.5 కిలోమీటర్ల కరకట్ట పునర్నిర్మాణానికి రూ.136.25 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ తాజాగా ఆమోదం తెలిపింది.
Scroll for the next article