News27th Dec 01:22 PMSunil Byrisetty1 min read

గిరిజన రైతుల కోసం ITDAలకు రూ.13.70 కోట్లు విడుదల

గిరిజన రైతుల కోసం అన్ని ITDAలకు రూ.13.70 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నా

గిరిజన రైతుల కోసం ITDAలకు  రూ.13.70 కోట్లు విడుదల
గిరిజన రైతుల కోసం అన్ని ITDAలకు రూ.13.70 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన కుటుంబాల జీవనోపాధి బలోపేతం కోసం ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల అమలు చేస్తున్నారన్నారు. లబ్ధిదారులకు వ్యవసాయ జీవనోపాధి పరికరాల పంపిణీ ద్వారా రైతులకు మేలు చేస్తున్నట్లు వివరించారు. పరికరాలు 90% సబ్సిడీపై గిరిజన రైతులకు అందజేస్తున్నామన్నారు. రైతుల శ్రమ తగ్గించి ఉత్పాదకత పెంచేందుకు ట్రాక్టర్లు & మినీ ట్రాక్టర్ల మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గిరిజనుల ఉత్పత్తులు మార్కెట్‌కి సులభంగా చేరేందుకు రవాణా కోసం ట్రక్కులు అందజేస్తున్నామన్నారు.
Andhra Pradesh
Tribal Farmers
ITDA
Agriculture Support
Subsidy
Farming Equipment
Tractors
Rural Development
Tribal Welfare
Livelihood Enhancement
జీవనోపాధి బలోపేతం
ప్రభుత్వ పథకం
రైతు సహాయం
Scroll for the next article