News10th Jun 02:54 PMSunil Byrisetty1 min read
కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావుకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రాజధాని రైతు మహిళలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. నిన్న హైద
సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావుకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రాజధాని రైతు మహిళలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు నేడు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. శ్రీనివాస్‌కి 14రోజులు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించనున్నారు. కొమ్మినేనిపై 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U) ఎస్సీ, ఎస్టీ POA యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అమరావతి మహిళలను అవమానించిన కేసులో ఏ2 కొమ్మినేనిగా ఉన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.