News26th Nov 03:59 PMSunil Byrisetty1 min read
'14490' మహిళా భద్రతకు కొత్త హెల్ప్‌లైన్
మహిళా భద్రతకు కొత్త హెల్ప్‌లైన్ తీసుకొస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ మహిళా కమిషన్ ఈ మేరకు ప్రకటించి
మహిళా భద్రతకు కొత్త హెల్ప్‌లైన్ తీసుకొస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ మహిళా కమిషన్ ఈ మేరకు ప్రకటించింది. మహిళల భద్రత కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కొత్త హెల్ప్‌లైన్ నంబర్ 14490ను ప్రారంభించింది. హింస, వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. న్యూఢిల్లీలోని కార్యాలయం నుంచి పనిచేసే ఈ హెల్ప్‌లైన్, బాధిత మహిళలను పోలీసు, ఆసుపత్రులు, న్యాయ అధికారులు వంటి సంబంధిత అధికారులతో అనుసంధానిస్తుంది. మహిళలు దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా రక్షణ కోసం ఈ హెల్ప్ లైన్‌ను సంప్రదించవచ్చు.