News24th Jan 05:10 PMSunil Byrisetty1 min read

బడ్జెట్లో సాగునీటి రంగానికి 15% నిధులు

రాబోవు బడ్జెట్లో సాగునీటి రంగానికి 15 శాతం నిధులు కేటాయించి అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అ

బడ్జెట్లో సాగునీటి రంగానికి 15% నిధులు
రాబోవు బడ్జెట్లో సాగునీటి రంగానికి 15 శాతం నిధులు కేటాయించి అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డా. నరెడ్డి తులసి రెడ్డి అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మెట్టప్రాంతాల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.నారాయణ అధ్యక్షత వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బడ్జెట్లో 15% నిధులు సాగునీటి రంగానికి కేటాయించేవని, అందువల్లనే శ్రీశైలం, నాగార్జునసాగర్, ధవలేశ్వరం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ లాంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలుగుగంగా, గాలేరు నగరి,హంద్రినీవా, వెలిగొండ, పులిచింతల ప్రాజెక్టులలో సింహభాగం పూర్తయ్యాయన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు బడ్జెట్లో సాగునీటి రంగానికి కేటాయింపులు తగ్గించిన కారణంగా ప్రాజెక్టుల నిర్మాణము నత్తనడకన సాగుతూ వుందన్నారు. కనుక కనీసం 15% నిధులు కేటాయించి అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.
Budget
Irrigation
Agriculture
Water Projects
Rayalaseema
Prakasam
Nellore
Congress Party
Nareddy Tulasi Reddy
Srisailam
ధవలేశ్వరం
అసంపూర్తి ప్రాజెక్టులు
అభివృద్ధి
నిధులు
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Scroll for the next article