News2nd Jan 11:46 AMSunil Byrisetty1 min read

రాజధానిలో అందుబాటులోకి 1.5 కి.మీ సీడ్ యాక్సిస్ రోడ్డు

అమరావతి రాజధానిలో మరో 1.5 కి.మీ సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గింది. ఈ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి వచ్చి

రాజధానిలో అందుబాటులోకి 1.5 కి.మీ సీడ్ యాక్సిస్ రోడ్డు
అమరావతి రాజధానిలో మరో 1.5 కి.మీ సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గింది. ఈ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సిస్ రోడ్డు,గుంటూరు చానెల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. కరకట్టపై వెళ్ళే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు.
Andhra Pradesh
Amaravati
Capital City
Seed Axis Road
Vijayawada to Amaravati
Infrastructure Development
స్టీల్ బ్రిడ్జి
గుంటూరు చానెల్
మంత్రి నారాయణ
Scroll for the next article