News30th Sep 05:39 PMSunil Byrisetty1 min read
ఘన చరిత్ర.. ఒంగోలుకే సొంతం
ఒంగోలుకు ఎంతో ఘన చరిత్ర ఉందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ పట్టణ అభివృద్ధిలో ఎందరో మహానుభావుల భాగస్వామ్యం ఉందని తెలిపారు. ఒంగోలు మున్సిపాలిటీగా
ఒంగోలుకు ఎంతో ఘన చరిత్ర ఉందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ పట్టణ అభివృద్ధిలో ఎందరో మహానుభావుల భాగస్వామ్యం ఉందని తెలిపారు. ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒంగోలు ఉత్సవ్ వేడుకల్లో గొట్టిపాటి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఘన చరిత్ర కలిగిన ప్రాంతంగా ఒంగోలుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఒంగోలు నుంచి ఎందరో మహానుభావులు దేశ సేవ చేశారని చెప్పారు. పోరాట వీరులు, కవులు, చరిత్రకారులు, రాజకీయ నాయకులకు ఈ ప్రాంతం పుట్టినిల్లుగా నిలిచిందన్నారు. మద్రాసు ఏజెన్సీగా నెల్లూరు జిల్లాలో ఉన్నప్పటి నుంచే ఒంగోలు తన ప్రత్యేకతను చాటుకుంటోందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ఎంతో ఘన చరిత్ర, పూర్వ వైభవం ఒంగోలు పట్టణ సొంతమని మంత్రి గొట్టిపాటి తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్త నిర్వహణలో ఒంగోలు పట్టణం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం అందరూ గర్వించదగ్గ విషయమన్నారు.