News4th Nov 02:45 PMSunil Byrisetty1 min read

వందేమాతరానికి 150 వసంతాలు

వందేమాతరం గీతానికి 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల 7వ తేదీ నరాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ పిలుపు ఇచ్చారు. బిజెపి

వందేమాతరానికి 150 వసంతాలు
వందేమాతరం గీతానికి 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల 7వ తేదీ నరాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ పిలుపు ఇచ్చారు. బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ఇన్ ఛార్జి గా బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ ను పార్టీ ప్రకటించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వందేమాతరం గీతానికి 150వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని మాధవ్ పేర్కొన్నారు. వినుకొండ లో వందేమాతరం గీతాన్ని ఆలపిస్తే కాల్పులు జరిపారు, రాజమహేంద్రవరం లో వందేమాతరం గీతాన్ని స్పూర్తి గా తీసుకుని యువత ఉద్యమించింది. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర్య సమరం లో కీలక పాత్ర వహించింది. బెంగాల్ విభజన అడ్డు కోవడం లో వందేమాతరం గీతం కీలకం. ఆనాడు బ్రిటీషర్ ఎదురైతే వందేమాతరం అంటూ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో 7వ తేదీన కాకినాడలో వందేమాతరం 150 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాధవ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Andhra Pradesh
PVN Madhav
Vande Mataram 150
BJP
Freedom Movement
Bankim Chandra Chatterjee
Patriotic Song
దేశభక్తి గీతం
భారత స్వాతంత్ర్యం
కాకినాడ వేడుకలు
Scroll for the next article