News8th Dec 03:06 PMSunil Byrisetty1 min read
జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు
‘వందేమాతరం’ అనేది ఒక మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమానికి వందేమాతరం శక్తి, ప్రేరణనిచ్చాయన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ఇవాళ్టి చర్చల
‘వందేమాతరం’ అనేది ఒక మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమానికి వందేమాతరం శక్తి, ప్రేరణనిచ్చాయన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ఇవాళ్టి చర్చలు భవిష్యత్తు తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. వందేమాతరం నినాదం.. బ్రిటిషర్లకు సింహస్వప్నంగా మారిందని గుర్తు చేశారు. 1857 తర్వాత స్వాతంత్య్ర సమరయోధులపై ఒత్తిడి పెంచిన వెనక్కి తగ్గకుండా వందేమాతరం రచించారని పేర్కొన్నారు. భారత్ నలువైపులా వందేమాతర నినాదం మారుమోగిందన్నారు. మాతృభూమి దాస్య శృంఖలాలు తెంచేందుకు వందేమాతరం కీలకంగా మారిందని వివరించారు. వందేమాతరం.. స్వాతంత్య్ర భారత్‌కు విజన్‌గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో పేర్కొన్నారు. జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయినందున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.