News18th Sep 03:50 PMSunil Byrisetty1 min read

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ షిప్‌బిల్డింగ్, మెరైన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌ ఏర్పాటుకు

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ షిప్‌బిల్డింగ్, మెరైన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌ ఏర్పాటుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సచివాలయంలో ఎండీఎల్, నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్–ఏపీ (NSHIP-AP) మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. దుగరాజపట్నంలో ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌ నిర్మాణం కోసం వచ్చే 5 ఏళ్లలో ఎండీఎల్ సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. షిప్‌బిల్డింగ్‌తో పాటు అనుబంధ పరిశ్రమలు, మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసెస్ తదితర రంగాల్లో పెద్దఎత్తున ఉపాధి, పెట్టుబడులు వస్తాయి. ప్రతిపాదిత షిప్‌యార్డ్‌ ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల (1.2 మిలియన్ GT) నౌకల నిర్మాణ సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని విస్తరించేందుకు కూడా వీలుంది. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్ఎన్‌జీ క్యారియర్లు, ఇతర భారీ ప్రత్యేక నౌకలను నిర్మించేలా ఈ షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేయనున్నారు.
Scroll for the next article