News14th Sep 11:27 AMSunil Byrisetty1 min read
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం 1న
రాష్ట్రంలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక పథకం కింద రూ.15,000 ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం
రాష్ట్రంలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక పథకం కింద రూ.15,000 ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ సాయం అందజేస్తుంది. సొంత వాహనం కలిగి, దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
దరఖాస్తుదారులకు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. దారిద్య్ర రేఖకు దిగువన రేషన్ కార్డు కలిగి ఉండాలి. విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. వాహనాలకు పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు. కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19 వరకు అవకాశం కల్పిస్తారు.
ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు అక్టోబరు 1న బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.