News9th May 06:02 PMSunil Byrisetty1 min read

గిరిజన ప్రాంతాల్లో త్రాగు నీరు, మౌలిక వసతులకు రూ. 156 కోట్లు

రాష్ట్రంలోని అన్ని గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, త్రాగు నీరు, రోడ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని గిరిజన సంక్షేమం, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

గిరిజన ప్రాంతాల్లో త్రాగు నీరు, మౌలిక వసతులకు రూ. 156 కోట్లు
రాష్ట్రంలోని అన్ని గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, త్రాగు నీరు, రోడ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని గిరిజన సంక్షేమం, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని 9 ఐటీడీఏ పీవోలు, ఇతర లైన్ డిపార్ట్ మెంట్ల అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని మంత్రి విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించారు. జూన్లో స్కూల్స్ ప్రారంభించే నాటికి అన్ని స్కూల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించామని చెప్పారు. అందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రూ. 156 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. 4,000 పైచిలుకు గిరిజన గ్రామాల్లోని ప్రజలకు త్రాగు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే దాదాపు మెజారిటీ గ్రామాల్లో త్రాగు నీరు అందించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, త్రాగు నీరు, సాగు నీరు, రోడ్లు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవడంతోపాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలను ఈ సమీక్షా సమావేశంలో పరిశీలించామన్నారు.
Andhra pradesh
Nara lokesh
drinking water
infrastructure
గిరిజన సంక్షేమ శాఖ
156 కోట్లు మంజూరు
గిరిజన గ్రామాల్లోని ప్రజలకు త్రాగు నీరు
విద్య
వైద్యం
Scroll for the next article