News16th Jan 10:56 AMSunil Byrisetty1 min read
ఏపీ తీరం అభివృద్ధికి రూ.15,601 కోట్ల పెట్టుబడులు
ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని మారిటైం హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 1,054 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియో
ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని మారిటైం హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 1,054 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేస్తూ రూ.15,601 కోట్ల పెట్టుబడులతో నౌకా నిర్మాణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 'గోవా షిప్ యార్డు లిమిటెడ్' సంస్థ మచిలీపట్నం పోర్టు పరిధిలో నౌకా నిర్మాణం మరియు మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మరిన్ని దిగ్గజ సంస్థలను ఆకర్షించడం ద్వారా మారిటైం రంగంలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంటోంది.