News2nd Oct 05:41 PMSunil Byrisetty1 min read

గాంధీ హిల్‌పై 157వ గాంధీ జయంతి

మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను నేటి తరానికి చేరువ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత ప్రభుత్వ మాజీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.వి. చౌదరి అన్నారు.

గాంధీ హిల్‌పై 157వ గాంధీ జయంతి
మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను నేటి తరానికి చేరువ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత ప్రభుత్వ మాజీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.వి. చౌదరి అన్నారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. గాంధీ హిల్ ఫౌండేషన్, ఏపీ గాంధీ స్మారక నిధి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ గాంధీ హిల్‌పై 157వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాంధీ హిల్ ఫౌండేషన్, ఏపీ గాంధీ స్మారక నిధి చైర్మన్ డా. గాంధీ పి.సి. కాజా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కె.వి. చౌదరి మాట్లాడుతూ గాంధీజీ జీవితం ప్రపంచానికే ఒక గొప్ప సందేశమన్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో పోషించిన పాత్రను, దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం బెలగా భీమేశ్వరరావు రచించిన ‘భూమి నవ్వాలి’, డా. జి.వి. పూర్ణచంద్ రచించిన ‘బెజవాడలో గాంధీజీ’ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు.
Scroll for the next article