News25th Dec 04:12 PMSunil Byrisetty1 min read
15 అడుగుల అటల్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా 15 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ గురువారం జరిగింది. ఈ ప్రదేశాన్ని అటల్ బిహారీ వాజ్ పేయి స్మృతి వనంగా తీర్చిదిద్దన
తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా 15 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ గురువారం జరిగింది. ఈ ప్రదేశాన్ని అటల్ బిహారీ వాజ్ పేయి స్మృతి వనంగా తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పేరుతో బహిరంగ సభ జరిగింది. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను ఆవిష్కరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి అన్ని రంగాల్లో తనకు ప్రేరణ అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. పోఖ్రాన్ అణ్వాయుధ పరీక్షలు చేశారని, అమెరికా అక్షలు విధించినా పట్టించుకోలేదని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. గ్రామ వికాసం, స్వర్ణ చతుర్భుజికి పెద్ద పీట వేశారని చెప్పారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చరిత్ర గుర్తించే విధంగా అటల్ బిహారీ వాజ్ పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే స్మృతి వనం నిర్మిస్తున్నామన్నారు. 26 జిల్లా కేంద్రాల్లో అటల్ విగ్రహాలను ప్రతిష్టించేలా కూటమి సంయుక్తంగా పనిచేసిందని చెప్పారు. సుపరిపాలన దివస్ గా అటల్ జీ జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నామని వివరించారు.