Politics1st Oct 10:40 AMSunil Byrisetty1 min read

SIR పూర్తయ్యేలోపు 16.50 కోట్ల మంది ఓట్లు గల్లంతు?

దేశంలో ఇప్పటివరకు జరిగిన SIRలో 6.5 కోట్ల ఓటర్లను తొలగించారని ప్ర‌ముఖ రాజకీయ విశ్లేషకులు, కేంద్ర ఆర్థిక మంత్రి భ‌ర్త‌ పరకాల ప్రభాకర్ అన్నారు. SIRపై ఆయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్

SIR పూర్తయ్యేలోపు 16.50 కోట్ల మంది ఓట్లు గల్లంతు?
దేశంలో ఇప్పటివరకు జరిగిన SIRలో 6.5 కోట్ల ఓటర్లను తొలగించారని ప్ర‌ముఖ రాజకీయ విశ్లేషకులు, కేంద్ర ఆర్థిక మంత్రి భ‌ర్త‌ పరకాల ప్రభాకర్ అన్నారు. SIRపై ఆయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రక్రియ పూర్తి అయ్యేలోపు 16.50 కోట్ల మంది ఓట్లు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కోట్ల మంది ఓటర్లను దేశ రాజకీయ సమాజం నుంచి తొలగిస్తున్నారన్నారు. దేశ రాజకీయాల్లో పాల్గొనే పాత్ర, అర్హత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. డూప్లికేట్, చనిపోయిన ఓటర్లను మాత్రమే తొలగిస్తున్నారంటే అది అపోహ మాత్రమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సామాజిక వర్గాల వారిని రాజకీయ సమాజం నుంచి వేరు చేసే ప్రక్రియ SIR అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Scroll for the next article