News31st Oct 11:46 AMSunil Byrisetty1 min read

ప్రభుత్వ ఆసుపత్రిలో కంప్యూటర్లు

బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 17 నూతన కంప్యూటర్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) నిధులు రూ. 12

ప్రభుత్వ ఆసుపత్రిలో కంప్యూటర్లు
బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 17 నూతన కంప్యూటర్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) నిధులు రూ. 12 లక్షలతో ఏర్పాటు చేసిన 17 కంప్యూటర్లు ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. రోగుల ఆన్లైన్ పేషెంట్ రిజిస్ట్రేషన్, ఇన్ పేషెంట్, డిశ్చార్జ్ వంటి రోగుల సమగ్ర సమాచారం నిర్వహణకు డిజిటలైజెషన్ ప్రక్రియలో ఈ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా స్థానిక 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 17 కంప్యూటర్లు, 5 ప్రింటర్లను నేడు ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా.. అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఈ సందర్భంగా వైద్యులు అభినందనలు తెలిపారు.
Andhra Pradesh
Banaganapalle
Government Hospital
BC Janardhan Reddy
NRHM
Healthcare Digitalization
ఆరోగ్య సేవలు
పేషెంట్ రిజిస్ట్రేషన్
వైద్య సదుపాయాలు
Scroll for the next article