News14th Jul 04:13 PMSunil Byrisetty1 min read
17 ఏళ్లుగా పెండింగ్.. కారుణ్య నియామకానికి ఆమోదం
ఆర్ & బీ శాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకానికి ఆ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆమోదం తెలిపారు. సచివాలయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ, నియామక
ఆర్ & బీ శాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకానికి ఆ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆమోదం తెలిపారు. సచివాలయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ, నియామక పత్రాన్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియామక పత్రం అందుకున్న కే. లక్ష్మణ్ కుమార్ ను మంత్రి అభినందించిగా, ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కాకినాడ ఆర్ & బీ డివిజన్ లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాంగ్ మజ్ధూర్ కే.వీ అప్పారావు అనారోగ్యంతో మరణించారు.. నాటి నుంచి వారి కుటుంబం కారుణ్య నియామకం కోసం ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఆర్ &బీ శాఖలో దాదాపు 2009 నుంచి పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకం అంశంపై నేడు కూటమి ప్రభుత్వంలో మంత్రి ప్రత్యేక చొరవతో ముందుకు కదిలింది. ప్రతిపక్షంలో ఉండగా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల విషయంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నాడు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నేరవేర్చుతూ.. నేడు లక్ష్మణ్ ను మానవతా దృక్ఫథంతో ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడం జరిగింది.