Jobs11th Oct 04:57 PMSunil Byrisetty1 min read

ఉద్యోగ మేళాలో 18 మంది ఎంపిక

రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విశేష కృషి చేస్తున్నారు. వారం వారం జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురంలోని శనివా

ఉద్యోగ మేళాలో 18 మంది ఎంపిక
రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విశేష కృషి చేస్తున్నారు. వారం వారం జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురంలోని శనివారం ఉపాధి కార్యాలయంలో జరిగిన ఉద్యోగ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలలో 18 మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారందరూ హోసూర్ లో విధులు నిర్వహిస్తారని కంపెనీల ప్రతినిధులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, ఉపాధి ప్రాజెక్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాలు ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పన ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీల ప్రతినిధులు సునీల్, జయంత్ తదితరులు హాజరై ఉద్యోగానికి ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేశారు. ఉద్యోగం పొందిన 18 మంది మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్, ఉపాధి బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Andhra Pradesh
Employment Drive
Job Fair
Employment Opportunities
Ramachandrapuram
Tata Electronics
Youth Empowerment
Skill Development
Vasamshetty Subhash
Satyam Foundation
Job Selection
Scroll for the next article